Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి:

Advertisement
కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి మండలం హాజీపూర్​ కట్టకింది తండాలో మంగళవారం చోటు చేసుకుంది. తండాకు చెందిన కడావత్​ రెడ్యా(26), ఆయన తండ్రి కడావత్​ చందర్​కు మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా తండ్రీకొడుకులు మరోసారి గొడవ పడ్డారు. అనంతరం రెడ్యా పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.