అక్షరటుడే, బాన్సువాడ: జీవితంపై విరక్తితో చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నస్రుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఇన్ ఛార్జి ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మన్ దేవుపల్లికి చెందిన చాకలి గంగారం(45) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం సహకరించక జీవితంపై విరక్తి చెంది సోమవారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement