అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలో చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన నాగుల మారుతి(32) క్షౌర వృత్తి చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. తన బాబాయ్ కూతురు వివాహం కోసం శుక్రవారం నర్సింగ్‌పల్లికి వెళ్ళాడు. శనివారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.