అక్షరటుడే, కామారెడ్డి టౌన్: షుగర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మనస్తాపంతో ఆస్పత్రి బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డిలోని జీవధాన్ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లింగంపేటకు చెందిన సాయిలు కొద్ది రోజులుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన చేయికి వారం రోజుల క్రితం గాయమైంది. షుగర్ ఉండడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. దీంతో కామారెడ్డిలోని జీవధాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఆస్పత్రి బాత్రూంలో ఉరి వేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.