అక్షరటుడే, వెబ్ డెస్క్ : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో కేంద్రంతో పాటు, భారత ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాల హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఉచితాల కారణంగా ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. ఇదే అంశంపై పెండింగ్ లో ఉన్న పలు కేసులతో కలిపి దీన్ని విచారించాలని సుప్రీం నిర్ణయించింది.