అక్షరటుడే, ఇందూరు: స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం ఎంతో అవసరమని మేయర్ నీతూకిరణ్ అన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ ను సందర్శించి, ప్రేరణ పొంది దేశ సేవకు యువత నడుం బిగించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాలు తెలుస్తాయన్నారు. అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ మాట్లాడుతూ.. నేటి యువతకు ఇదో మంచి కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. కార్యక్రమంలో సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్, కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమాధికారి రసూల్ బీ, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ రవీంద్రారెడ్డి, ఆకాశవాణి ఏవో మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement