అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 28 మందికి గాయాలు కాగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సు మంగళవారం ఉదయం కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులోని 44వ జాతీయ రహదారిపై లారీని ఢీకొంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకు వేెయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అప్సర్‌ఖాన్ అనే వ్యక్తి మృతి చెందగా.. 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.