అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  martial arts | మార్షల్ ఆర్ట్స్​లో టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​కు బ్లాక్​బెల్ట్​