అక్షరటుడే, వెబ్‌డెస్క్: వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలను సియాటిల్ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. ఆ ఆదేశాలను న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యంగ విరుద్ధమని న్యాయమూర్తి పేర్కొన్నారు.
జనవరి 20న యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. పారిస్ ఒప్పందం, డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పని విధానం రద్దు, ప్రభుత్వ నియామకాల నిషేధం, క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః పౌరసత్వ రద్దు తదితర కీలక నిర్ణయాలు అందులో ఉన్నాయి.