అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: మండలంలోని గర్గుల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం మండలస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్‌ 14 బాలురు, బాలికల విభాగంలో పోటీలు నిర్వహించగా, బాలుర విభాగంలో ప్రోబెల్స్‌ పాఠశాల ప్రథమ, గర్గుల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో శ్రీసరస్వతి శిశుమందిర్‌ పాఠశాల ప్రథమ, ప్రోబెల్స్‌ పాఠశాల ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం బ్రహ్మం, పీడీ నోముల మధుసూదన్‌ రెడ్డి, ప్రభులింగం, లక్ష్మణ్, దయాకర్, పీఈటీలు ఉన్నారు.