అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ఓపెన్ అయ్యాయి. ఉదయం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 900, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంట్రప్రెస్స్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంకు, జేఎస్ డబ్ల్యూ, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, విప్రో, బీపీసీఎల్, బ్రిటానియా, హిందుస్తాన్ యూనీలీవర్, టీసీఎల్, టైటాన్ వంటి స్టాక్స్ లాభాలతో, యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, హీరో మోటార్, వోఎన్జీసీ వంటి స్టాక్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి.