అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత ఉన్న లక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.