అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. 30 ఏళ్లు పైబడిన మహిళలకు వివిధ రకాల క్యాన్సర్, థైరాయిడ్, గర్భకోశ, మూత్ర కోశ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారిణి శ్రీలేఖ తెలిపారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీహెచ్‌వో రవీందర్, ఎoఎల్‌హెచ్‌పీలు ప్రీతి, సాగర్, సూపర్ వైజర్లు నర్సమ్మ, సుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.