అక్షరటుడే, కోటగిరి: మండలంలోని కొత్తపల్లిలో శనివారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ గంగాధర్ పరిశీలించి మాట్లాడారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సుదర్శన్, బీఎల్‌వోలు చిరంజీవి, విజయ పాల్గొన్నారు.