అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పోలీసులకు విధి నిర్వహణతో పాటు క్రీడలూ అవసరమేనని ఇన్ ఛార్జి సీపీ సింధూశర్మ అన్నారు. మంగళవారం ఎడపల్లి పీఎస్‌ పరిధిలోని జాన్కంపేటలో గల పోలీస్‌ శిక్షణ కేంద్రంలో స్టైఫండరీ కేడెట్‌ ట్రెయినీ కానిస్టేబుళ్లకు స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ ఛార్జి సీపీ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అదనపు సీపీ(అడ్మిన్‌) కోటేశ్వర రావు, అదనపు డీసీపీ(ఎల్‌అండ్‌వో) బస్వారెడ్డి, సీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ మస్తాన్‌ అలీ, ఎస్‌బీ ఏసీపీ ఎస్‌.శ్రీనివాస్‌ రావ్, ఏఆర్‌ ఏసీపీ నాగయ్య, బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్, సీఐ శివరాం, ఆర్‌ఐ శ్రీపాల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad cp | త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు.. కసరత్తు చేస్తున్న సీపీ