అక్షరటుడే, కామారెడ్డి: Gold Prices | బంగారం ధర(Gold price)లు భగ్గుమంటున్నాయి. అయితే కామారెడ్డి జిల్లాలో మంగళవారం బంగారం ధరల్లో విచిత్ర పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం 12 గంటలకు రూ.93,400 ఉన్న ధర గంటలోపు రూ.93,500కు చేరింది. తిరిగి గంటన్నర లోపే రూ.93,700 లకు చేరి మరొక అరగంటలోనే రూ.93,850కి చేరింది. ఇలా ఎవరికి వారు ధరలను మార్చడం చర్చకు దారితీసింది.
Gold Prices | మూడు గంటల్లోనే మూడుసార్లు..
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3:30 గంటల వరకు మూడు సార్లు(Four Times)) ధర పెరగడంతో ప్రజలు అవాక్కయ్యారు. గంట గంటకు ధర మారడంతో అసలు బంగారం ధర ఎంత ఉందో అర్థం కాని పరిస్థితుల్లో సందిగ్ధంలో పడ్డారు. బంగారం కొనుగోలు కోసం షాపుల(Shops)కు వెళ్లిన ప్రజలకు ఇప్పుడే రూ.200 పెరిగిందని చెప్పడంతో అనేక మంది నాలుగైదు షాపు(Four five shops)లు తిరిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి(Situation) ఏర్పడింది.