అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఓ విద్యార్థి అప్పులు తీర్చే మార్గంలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈఘటన ఏపీలోని మాచర్ల పట్టణంలో చోటు చేసుకుంది. మాచర్లలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో భరత్ అనే విద్యార్థి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. భరత్ ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసగా మారి అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గంలేక పట్టణంలోని విష్ణుప్రియ లాడ్జి వెనుక భవనంలో ఉన్న తన రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.