అక్షరటుడే, ఇందూర్ : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని పలుచోట్ల స్వచ్ఛత హి సేవా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కంఠేశ్వర్‌, రఘునాథ చెరువు ఆవరణలో అవగాహన కల్పించారు. దుకాణాల ముందు, కాలనీలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సిబ్బంది పాల్గొన్నారు.