అక్షరటుడే, వెబ్‌డెస్క్ : చేపల పెంపకం, క్రయ విక్రయాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ మత్స్యశాఖ అధికారుల బృందం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లింది. ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో ఈనెల 13వరకు పర్యటించనుంది. తదనంతరం రాష్ట్రంలో చేపల పెంపకంపై నూతన పాలసీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.