పాఠాలు చెప్పమంటే.. అసభ్యకరంగా ప్రవర్తించాడు!

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కూతురు సమానమైన బాలికను వేధింపులకు గురి చేశాడు. చివరకు బాలిక ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కీచక ఉపాధ్యాయుడి బండారం బయట పడింది. లింగంపేట మండలం శెట్టిపల్లి ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి కథనం ప్రకారం.. శెట్టిపల్లి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని పట్ల తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శర్మ అసభ్యకరంగా ప్రవర్తించిచాడు. పాఠశాలలో రెండు రోజుల కిందట షీ టీం బృందం విద్యార్థినులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సమయంలో బాధిత విద్యార్థిని షీ టీం బృందం ఎదుట ఉపాధ్యాయుడు తనపట్ల ప్రవర్తిస్తున్న తీరును బయటకు చెప్పింది. అనంతరం లింగంపేట్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బుధవారం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇదే ఉపాధ్యాయుడు కొద్ది రోజుల కిందట మహిళా ఉపాధ్యాయులతోనూ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. అనంతరం వారు మందలించారు. అయినా తన బుద్ధి మార్చుకోకపోవడంతో చివరకు పోలీసులు అరెస్టు చేశారు.