అక్షరటుడే, వెబ్‌డెస్క్: అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యుఎస్ వాషింగ్టన్ డీసీలో ఆకాశంలోనే విమానం, హెలికాప్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 67 మంది ప్రయాణికులు మరణించినట్లు అమెరికా ప్రకటించింది. రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకునే క్రమంలో ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో గాలిలోనే విమానం పేలిపోయి పోటోమాక్ నదిలో విమానం కూలిపోయింది. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. యూఎస్ చరిత్రలో ఇది అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు.
ఆకాశంలో విమానం, హెలికాప్టర్ ఢీ : 67 మంది దుర్మరణం
Advertisement
Advertisement