అక్షరటుడే, వెబ్ డెస్క్: యాదాద్రి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లో ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్ హయత్ నగర్ ప్రాంతానికి చెందిన వంశీగౌడ్, దినేష్, హర్ష, బాలు, వినయ్‌గా గుర్తించారు. మణికంఠ అనే మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశారు.