అక్షరటుడే, వెబ్‌డెస్క్ : మూడేళ్ల చిన్నారి పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. మూడు రోజులుగా ఆపాపను కాపాడే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోఠిపుత్లీ-బెహ్రర్ జిల్లాలో చేతన(3) అనే చిన్నారి సోమవారం పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 700 అడుగుల లోతుగల బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 150 అడుగుల వద్ద చిన్నారి చిక్కుకున్నట్లు గుర్తించారు. బోరుబావిలోకి పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు.
Advertisement
Advertisement