అక్షరటుడే, వెబ్​డెస్క్​: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన 4 నెలల కవల పిల్లలకు డబ్బా పాలు తాగించింది. అనంతరం కొద్దిసేపటికే.. ఇద్దరు పిల్లలు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని భూపాలపల్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.