అక్షరటుడే, వెబ్డెస్క్ : ఇజ్రాయోల్ ప్రధాని నెతన్యాహుపై మోసం, నమ్మకద్రోహం, అవినీతి ఆరోపణల విషయమై టెల్ అవీవ్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయోల్ ప్రధానిగా ఆయన నిలిచారు. గతంలో వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం గాజా యుద్ధం కొనసాగుతోన్న సమయంలో భద్రతా కారణ దృష్ట్యా టెల్అవీవ్ కోర్టులోని భూగర్భ ఛాంబర్లో విచారణ జరుపుతున్నారు.