అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ఐ అధికారులకు చిక్కిన నటి రన్యారావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆమె కాల్‌డేటా ఆధారంగా వ్యాపారవేత్త తరుణ్‌రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రన్యారావు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరుణ్ రాజ్ కు హోటల్స్, జ్యువెళ్లరీ వ్యాపారాలు ఉన్నాయి. తాజాగా ఆయన్ను అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో మరి కొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి.
Ranya Rao | బోరున విలపించిన నటి..
కాగా.. సోమవారం రన్యారావును డీఆర్ఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. అయితే జడ్జి ఎదుట ఆమె బోరున విలపించినట్లు సమాచారం. తనను డీఆర్ఐ అధికారులు వేధించారని ఆమె వాపోయారు.
కాగా.. దుబాయ్ నుంచి గత కొంతకాలంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు రన్యా రావుపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆమెను రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. ఏడాది కాలంలో ఆమె ఏకంగా 25 సార్లు దుబాయ్ వెళ్ళి వచ్చినట్లు విచారంలో తేలింది. దీంతో పాస్పోర్ట్ సహా ఆమెకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు.