అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: రెవెన్యూ అధికారులు వారసత్వ పట్టా చేయడం లేదని రామారెడ్డి మండలం ఉప్పల్ వాయికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ వాయికి చెందిన మంత్రి భగవాన్ తన తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన భూమికి పట్టాచేయడం లేదని మంగళవారం రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. సర్వే నంబర్ 856/68లో తన తండ్రి పేరిట ఎకరం భూమిని తన పేరు మీదకు మార్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. స్థానికులు గమనించి అడ్డుకున్నారు.