Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసానిపేట్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 9న వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నరేందర్ గౌడ్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని యువకులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ జట్టు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. టోర్నమెంట్​లో గెలిచిన జట్టుకు రూ.5 వేలు, రన్నర్​కు రూ.2,500 అందజేస్తామన్నారు. వివరాల కోసం 9603032511 నంబర్​ను సంప్రదించాలని కోరారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | ఉపాధి హామీ పనుల పరిశీలన