అక్షరటుడే, బోధన్ : మండలంలోని ఊట్‌పల్లి గ్రామంలో అసిస్టెంట్ లైన్‌మన్ నవీన్‌పై ఓ మహిళ దాడి చేసింది. విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాలతో శుక్రవారం మీటర్ల పరిశీలన కోసం నవీన్ గ్రామానికి వెళ్లాడు. అయితే ఓ మహిళ తన ఇంట్లో అక్రమంగా విద్యుత్‌ను వాడుతోందని తెలియడంతో వెళ్లి తొలగిస్తుండగా ఆగ్రహంతో ఆమె అతనిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ నవీన్‌ను విద్యుత్ యూనియన్ అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. అసిస్టెంట్ లైన్‌మన్ ఫిర్యాదు మేరకు మహిళతో పాటు ఆమె కోడలిపై కేసు నమోదు చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ తెలిపారు.