అక్షరటుడే, బాన్సువాడ: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్ని మండలం చింతల్‌పేట్ తండాలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణకుమార్ తెలిపిన వివరాలు.. తండాకు చెందిన హేమ్లిబాయ్ (55) ఆదివారం ఉదయం ఇంట్లో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెంది ఉరి వేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు భర్త రామ్‌చందర్, రెండో భార్య జెర్రీ కారణమని మృతురాలి బంధువులు ఆరోపించారు. రామ్‌చందర్ ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.