అక్షరటుడే, వెబ్‌డెస్క్: మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సింగాడికుంటలో మోమోస్ తిని 20 మంది అస్వస్థత గురికాగా ఓ మహిళ మృతి చెందింది. వారాంతపు సంతలో మోమోస్ అమ్మగా వాటిని కొనుక్కుని తిన్న వారందరూ వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. నందినగర్ లోనూ పలువురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులు మరింతమంది పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.