Advertisement

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన నగరంలోని బోర్గాం(పి)లో చోటు చేసుకుంది. నాల్గో టౌన్‌ ఎస్సై-2 ఉదయ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గాం(పి)లో కాలూరి నిహారిక(32) దుస్తులు ఆరవేసేందుకు సోమవారం రెండస్థుల భవనంపైకి వెళ్లగా.. ప్రమాదవశాత్తు కిందపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement