అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ : పక్కనకు వెళ్లి కూరగాయలు అమ్ముకోమన్నందుకు ఓ మహిళపై దాడి చేసిన ఘటన నగరంలోని వీక్లీ మార్కెట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గాయత్రి ఆయనే మహిళ వీక్లీ మార్కెట్లో టైలర్ షాప్ నిర్వహిస్తోంది. అయితే తన షాపు ముందు కూరగాయలు అమ్ముతున్న అమృత అనే మహిళను పక్కకు వెళ్లి విక్రయించుకోవాలని చెప్పింది. దీంతో అమృత, ఆమె తమ్ముడు, అక్క వైష్ణవితో కలిసి గాయత్రి, ఆమె భర్త రమేశ్‌పై దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా టైలర్ షాపు అద్దాలను ధ్వసం చేశారు. ఈ గొడవలో గాయత్రి తన మెడలోని బంగారు చెయిన్ పోయిందని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.