అక్షరటుడే, జుక్కల్‌: రెండు పదుల వయస్సులోనే జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ గ్రామంలో చర్చకు దారి తీసింది. నిజాంసాగర్‌ మండలంలోని మల్లూరు గ్రామంలో అడ్డగళ్ల సాయిలు(20) చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయిలు ఇంటర్‌ వరకు చదువుకొని కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లి ఓ కంపెనీలో నెలరోజుల పాటు పనిచేశాడు. అనంతరం తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థంకాక జీవితంపై విరక్తితో గురువారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత గ్రామ పొలిమేరలోని శ్మశాన వాటికలోకి వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సంజీవులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Warangal | వరంగల్ నిట్ విద్యార్థి ఆత్మహత్య