అక్షరటుడే, కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన యువకుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన సుజిత్ (16)కు పది రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. అక్కడ శనివారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.