అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో తిలకించేందుకు వచ్చిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముంబయికి చెందిన ఫేరోజ్ అనే యువకుడు ఇటీవల మెట్‌పల్లిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం డ్యాంను చూసేందుకు ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వెళ్లగా..ఈ క్రమంలో గేట్లకు కొద్దిదూరంలో నదిలోకి దిగడంతో నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. అయితే స్నేహితులు కాపాడేందుకు యత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.