అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సోషల్‌ మీడియా రీల్స్‌ మోజులో యువత తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. మూడు రోజుల క్రితం మహారాష్ట్రలో రీల్స్‌ చేసేందుకు ఓ యువతి కారు నడుపుతూ లోయలో పడి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా పుణెలోని జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్‌ సమీపంలో ఓ యువతి రీల్స్‌ కోసం పాడుబడిన బంగ్లాపై వేలాడుతూ అతి ప్రమాదకరంగా స్టంట్స్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రీల్స్‌ కోసం ప్రాణాలకు తెగించి ప్రమాదకరంగా వీడియోలు తీయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.