అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : బాణసంచాపై ఆంక్షలు ఏమతానికి సంబంధించినది కావని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశమని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దేశమంతంటా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఢిల్లీలో బాణసంచాపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. దీపావళి అనేది దీపాలను వెలిగించే పండుగని, బాణసంచా వల్ల వచ్చే కాలుష్యం ముఖ్యంగా పిల్లల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కాలుష్యం విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సంప్రదాయం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు సైతం కాలుష్యం పెరుగుతున్న సందర్భంగా బాణసంచా కాల్చరాదని, దీపాలు వెలిగించాలని తెలిపాయని పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శానిటేషన్‌ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెలాఖరులోపే జీతం, బోనస్‌ అందుతుందని కేజ్రీవాల్‌ తెలిపారు.