అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎం నివాసాన్ని శుక్రవారం ఖాళీ చేశారు. సివిల్ లైన్స్ ఏరియాలో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని ఇంటి నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వచ్చారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇక నుంచి కేజ్రీవాల్ ఆప్ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలోని బంగ్లాలో నివాసం ఉండనున్నారు.