srh vs pbks | చిట్టీ రాసుకొచ్చి మ‌రీ సెంచ‌రీ కొట్టాడు.. అభిషేక్ శ‌ర్మ ఆ పేప‌ర్‌లో ఏం రాసాడంటే!

అక్షరటుడే, వెబ్​డెస్క్: srh vs pbks | స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ SRH జ‌ట్టు ఈ సీజ‌న్‌లో చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న remarkable performance క‌న‌బ‌ర‌చ‌డం లేదు. తొలి మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన త‌ర్వాత వ‌రస‌గా ఓట‌మి consecutive defeats పాలైంది. అయితే గ‌త రాత్రి భారీ టార్గెట్ ని చేజ్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ Abhishek Sharma చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ నమోదు fastest century చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. 40 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న అభిషేక్ శర్మ Abhishek Sharma.. మొత్తం 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేశాడు.

Advertisement
Advertisement

srh vs pbks |  గ‌ట్టిగా ఇచ్చేశాడు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ Punjab Kings PBPK నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్ Shreyas Iyer(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ Prabhsimran Singh(23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), ప్రియాన్ష్ ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) రాణించడంతో జ‌ట్టు భారీ స్కోరే చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  srh vs pbks | దమ్ముంటే రా చూసుకుందాం.. మ్యాచ్ మ‌ధ్య‌లో కొట్టుకోబోయిన ప్లేయ‌ర్స్

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ Sunrisers Hyderabad భారీ ల‌క్ష్యాన్ని కేవ‌లం 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ‌తో Abhishek Sharma పాటు ట్రావిస్ హెడ్ Travis Head(37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించాడు. హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 30 సిక్సర్లు.. 44 బౌండరీలు నమోదయ్యాయి. అయితే అభిషేక్ శ‌ర్మ మైదానంలోకి దిగేముందే ఎలాగైనా సెంచరీ చేస్తానని బలంగా నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఒక కాగితం మీద రాసుకుని వచ్చాడు. సెంచరీ చేసిన తర్వాత తన జేబులో ఉన్న కాగితాన్ని బయటకి చూపించాడు. ఆ కాగితంలో ఆ పేపర్‌పై ‘This one is for Orange army(ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం) అని రాసి ఉంది. అంటే ముందే గ‌ట్టిగా ఇస్తాన‌ని ఫిక్స్ అయ్యాడ‌ని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు

Advertisement