అక్షరటుడే, బాన్సువాడ: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్ డిమాండ్ చేశారు. మంగళవారం వర్నిలో విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాజకీయ నాయకుల స్వార్థాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో వర్ని నగర కార్యదర్శి ప్రవీణ్, బోధన్ నగర కార్యదర్శి కునాల్, సంజయ్, జగదీష్, దత్తు, అనిల్, ప్రభు, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
Advertisement