అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దామ సునీల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ 26న తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్ కు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పాఠశాలలు బంద్ పాటించాలని కోరారు. ఈ సమావేశంలో ఇందూరు నగర కార్యదర్శి జగదీష్, బాలకృష్ణ, దుర్గా, ప్రవీణ్, సుభాష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.