ACB Raids | దూకుడు పెంచిన ఏసీబీ.. ఇక వారే టార్గెట్‌

ACB Raids | దూకుడు పెంచిన ఏసీబీ.. ఇక వారే టార్గెట్‌
ACB Raids | దూకుడు పెంచిన ఏసీబీ.. ఇక వారే టార్గెట్‌
Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB Raids | అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. లంచాలకు పాల్పడే వారే టార్గెట్‌గా నిఘా పెంచింది. ఇటీవలి కాలంలో పలు శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై అవినీతిపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌, రవాణా శాఖ, మున్సిపల్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌ తదితర శాఖల్లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు అనిశా(ACB)కు పలువురు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో దాదాపు పదికి పైగా ఏసీబీ కేసులు(ACB Cases) నమోదయ్యాయి. ఇందులో మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు, సిబ్బంది పట్టుపడ్డారు. నిజామాబాద్‌ నగరపాలక సంస్థ(Nizamabad municipal corporation)లో పనిచేసే రెవెన్యూ సూపరింటెండెంట్‌ నుంచి పెద్దమొత్తంలో అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తర్వాత ఏసీబీ అంటే ఒకింత ప్రభుత్వ శాఖలో భయం నెలకొన్నా.. పలువురి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు.

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో పలువురు పోలీసు అధికారులు కేసు నమోదు చేయాలంటే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్‌ బెయిల్‌(Station Bail) పేరిట ప్రతీ కేసులోనూ కక్కుర్తి పడుతున్నారు. అలాగే ఎక్సైజ్‌ శాఖలోనూ కల్తీ కల్లు తయారీదారుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలోనూ కొందరు ఒక్కో డాక్యుమెంట్‌కు ముందుగానే రేట్‌ ఫిక్స్‌ చేసి ముక్కుపిండి మరీ లంచం తీసుకుంటున్నారు. ఇలా.. ప్రతీ శాఖలోనూ గడిచిన మూడు నెలల్లో పలువురు అవినీతి అధికారులను ఏసీబీ(ACB raids) పట్టుకుంది. అయినా కొందరిలో మార్పు రావట్లేదు. దీంతో ఆకస్మిక తనిఖీలకు సైతం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే నిజామాబాద్‌ రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం సోదాలు చేపట్టింది. ఈ ఘటనతో అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారుల్లో మళ్లీ భయం పట్టుకుంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy MLA | మున్సిపల్‌ ఉద్యోగులపై ఎమ్మెల్యే గరంగరం..