DEO Office | ఆ ఉపాధ్యాయులపై ఏసీబీ ఆరా.. టార్గెట్ మాత్రం ఆయనే..!

DEO Office | ఆ ఉపాధ్యాయులపై ఏసీబీ ఆరా..!
DEO Office | ఆ ఉపాధ్యాయులపై ఏసీబీ ఆరా..!

అక్షరటుడే, వెబ్ డెస్క్: DEO Office | జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఏసీబీ అధికారులు(ACB Officers) వెళ్లిన ఘటన చర్చకు దారితీసింది. ప్రత్యేకించి గత డీఈవో హయంలో జరిగిన అవకతవకలు, విదేశాలకు వెళ్లిన టీచర్ల చిట్టాపై ఏసీబీ ఆరా తీసింది.

Advertisement
Advertisement

నాలుగు రోజుల క్రితం ఏసీబీ(ACB) అధికారులు జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి వెళ్లారు. ప్రత్యేకించి 2023 -24 విద్యా సంవత్సరంలో విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుల జాబితా అడిగినట్లు సమాచారం. ఎంత మంది ఉపాధ్యాయుల వెళ్లారు..? వారికి అనుమతులు ఎలా ఇచ్చారు..? తిరిగి వచ్చిన వారెందరు అనే విషయాలపై సమాచారం అడిగినట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై విద్యాశాఖ అధికారి(education officer)కి అశోక్​(nizamabad deo Ashok) ను వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని.. తనవద్దకు ఎవరు రాలేదని పేర్కొన్నారు. ఇదే విషయమై కార్యాలయంలో వాకబు చేయగా.. ఏసీబీ అధికారులు వచ్చి వారికి కావాల్సిన సమాచారాన్ని అడిగారని తెలిసింది.

ఇది కూడా చ‌ద‌వండి :  ACB | ఏసీబీకి చిక్కిన మార్కెట్​ కమిటీ సెక్రెటరీ

DEO Office | ఎన్నో ఆరోపణలు

డీఈవో దుర్గాప్రసాద్ హయంలో అనేక అవినీతి ఆరోపణలు బయటకు వచ్చాయి. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు పలు ఉపాధ్యాయ సంఘాలు ఆయనపై ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు అప్పటి వివరాలు సేకరిస్తున్నారా? అనేది మాత్రం స్పష్టత లేదు.

Advertisement