ACB Raids : రిజిస్ట్రేషన్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB Raids : నిజామాబాద్​ జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. నిజామాబాద్​ అర్బన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో సోమవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.

 

కాగా.. ఓ సబ్​ రిజిస్ట్రార్​ను విచారిస్తున్నట్లు తెలిసింది. అర్బన్​ కార్యాలయం పరిధిలో ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్​ సబ్​ రిజిస్ట్రార్లు పని చేస్తున్నారు.

అయితే డాక్యుమెంట్ల వెనక పెద్దఎత్తున వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి పార్ట్లీ రిజిస్ట్రేషన్ల కోసం తాము అడిగినంత చెల్లిస్తేనే ​ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. లేదంటే కొర్రీలు పెడుతున్నారు. దీంతో పలువురు బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  ACB Raids | ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు