ACB Raids | ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ACB Raids | ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ACB Raids | ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : ACB Raids | నిజామాబాద్​ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు బృందం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తనిఖీలు చేపడుతోంది. ప్రధాన గేటుకు తాళం వేసేసి సోదాలు చేపడుతున్నారు. సోదాల నేపథ్యంలో కార్యాలయం వెలుపల గల ఏజెంట్ల దుకాణాలు మూసివేశారు. కాగా.. ఈ కార్యాలయం పరిధిలో పలువురు అధికారులు ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | చైతన్య కార్యక్రమాలు అభినందనీయం

ACB Raids | వారం రోజుల్లోనే..

ఇటీవలే నిజామాబాద్ అర్బన్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయంలోనూ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ అధికారులు సోదాలు చేసిన వారం రోజులు తిరగకముందే ఆర్టీఏ కార్యాలయంలో తనిఖీలు చేస్తుండడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

Advertisement