అక్షరటుడే, బోధన్: Bodhan Bar Association | బోధన్ బార్ అసోసియేషన్(Bar Association) కార్యవర్గ సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. బార్ అసోసియేషన్‌ను ఇటీవల ఎన్నుకున్న విషయం తెలిసిందే.
అధ్యక్షుడిగా రాములు, ఉపాధ్యక్షుడిగా వీఆర్ దేశాయ్, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారిగా కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా ఆఫ్సర్ పాషా, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా సమ్మయ్య, గ్రంథాలయం కార్యదర్శిగా ఆరిఫోద్దీన్, ఈసీ మెంబర్లు బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రవికుమార్, అజయ్‌కుమార్, పూజిత, సాయిశివ, శేషతల్పసాయి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.