Garuda Puranam : గరుడ పురాణంలో ఒక వ్యక్తికి మరణం సంభవిస్తుంది అనే విషయం 6 నెలల ముందే ఈ సంకేతాలతో గుర్తించవచ్చట..!

Garuda Puranam : గరుడ పురాణంలో ఒక వ్యక్తికి మరణం సంభవిస్తుంది అనే విషయం 6 నెలల ముందే ఈ సంకేతాలతో గుర్తించవచ్చట...?
Garuda Puranam : గరుడ పురాణంలో ఒక వ్యక్తికి మరణం సంభవిస్తుంది అనే విషయం 6 నెలల ముందే ఈ సంకేతాలతో గుర్తించవచ్చట...?

అక్షరటుడే, వెబ్ డెస్క్ Garuda Puranam : గరుడ పురాణంలో ఒక వ్యక్తికి మరణం సంభవిస్తుంది అనే విషయం ఆరు నెలల ముందే ఈ సంకేతాలతో కనబడుతుందట. ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో మానవులు ఎంతవరకు జీవిస్తారు, వారి ఆయుష్షు ఎంత వరకు ఉందో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. మరణానికి వయసుతో సంబంధం ఉండదు. మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. అయితే, ముఖ్యంగా గరుడ పురాణంలో ఒక వ్యక్తికి తన మరణానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఆరు నెలల ముందు నుంచి తెలుస్తాయట.

Advertisement
Advertisement

మన హిందూ మతంలో మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి గరుడ పురాణం. ఒక వ్యక్తి చేసే కర్మలను ఆధారంగా అతను పొందే మంచి, చెడు ఫలితాల గురించి చెబుతుంది. పురాణానికి అది దేవత శ్రీమహావిష్ణువు. అందువల్ల ఈ పురాణాన్ని వైష్ణవ పురాణం అని కూడా అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో తాను చేసిన కర్మలను, తగిన ఫలితాన్ని కచ్చితంగా పొందుతారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా తన కర్మ ఫలాన్ని తప్పక అనుభవిస్తాడు.

మరణించిన మనిషి ఆత్మ పదమూడు రోజులు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే మరణించిన ఇంట్లో 13 రోజులు గరుడ పురాణం పారాయణం చేస్తారు. మరోవైపు గరుడ పురాణం ప్రకారం ఆ వ్యక్తి తమ వారం గురించి ఇప్పటికే తెలుసు. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయినా తన మరణాన్ని ఆరు నెలలు ముందుగానే ఊహించగలడు. మరణం సమీపించింది అనే లక్షణాలు వ్యక్తులకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి మరణానికి ముందు సంకేతాలను తెలుసుకోగలుగుతాడు.

మరణానికి ముందు ఈ ఏడు సంకేతాలు కనిపిస్తాయి: .ఒక వ్యక్తి తన ముక్కు ముందు బాగాన్ని చూడలేడు. ఇది ఎవరికైనా జరిగితే ఆ వ్యక్తి మరణం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలట. దీపం ఆరిన తరువాత ఒక వ్యక్తి దాని సువాసనను పీల్చలేక పోతే, అతని మరణం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలట.

  • ఒక మనిషి తన రెండు చెవులను వేళ్ళతో మూసుకున్న తర్వాత కూడా తన చెవుల్లో ఎటువంటి శబ్దం వినపడకపోతే ఆ వ్యక్తి త్వరలోనే చనిపోతాడని నమ్మకం.
  • మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే కుక్క మిమ్మల్ని వెంబడించడం ప్రారంభమవుతుంది. ఈ నాలుగు రోజులకు పైగా కొనసాగితే మరణం మీకు దగ్గరగా ఉందని అర్థం చేసుకోవాలి.
  • మరణం సంభవిస్తుంది అనగా అతను యమదూతలను చూడడం ప్రారంభిస్తాడు.
  • మరణం సంభవిస్తున్న కొద్ది సమయానికి చేతులపై ఉన్న రేఖలు మసకబారుతాయి. లేదా కొన్నిసార్లు పూర్తిగా అదృశ్యం కూడా అవుతాయి.
  • హిందూ మత గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి మరణానికి ముందు అనేక రకాల సంకేతాలను పొందుతాడు. వ్యక్తి మరణానికి కొంత సమయం ముందు తన మరణాన్ని అంచనా వేయగల కొన్ని సంకేతాలను చూస్తాడని గరుడ పురాణంలో ప్రస్తావించబడింది.

Advertisement