అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కొన్నేళ్లుగా చెరువులను ఆక్రమించడంతో హైదరాబాద్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హైడ్రా ద్వారా ఆక్రమిత చెరువులను, మూసి నదిని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. హైదరాబాద్‌ అంటేనే లేక్స్‌, రాక్స్‌, పార్క్స్‌ అని పేరుందన్నారు. చెరువులపై సమగ్ర సర్వే చేసి కబ్జాలను తొలగిస్తామని చెప్పారు.