అక్షరటుడే, ఎల్లారెడ్డి: సదాశివనగర్‌ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన కూలిపాక గణేష్‌ (36) మంగళవారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్‌ వ్యవసాయం చేస్తుండేవాడు. పొలం వద్ద నీళ్లు తాగేందుకు ఊట బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడి మృతి చెందాడు. భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై రంజిత్‌ తెలిపారు.